ఎఫ్‌ 3 ప్లాన్స్‌ తలకిందులు చేసిన వెంకటేష్‌  

Venkatesh F3 Varun Tej Anil Ravipudi 3 - Telugu Anil Ravipudi, F2, F3, Narappa, Tollywood, Varun Tej, Venkatesh

గత ఏడాది సంక్రాంతికి కానుకగా వచ్చిన ఎఫ్‌ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో ఎఫ్‌2 కు సీక్వెల్‌ ఎఫ్‌ 3ని స్పీడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు అనీల్‌ రావిపూడి భావించాడు.

 Venkatesh F3 Varun Tej Anil Ravipudi 3

కాని ఆయన అనుకున్నట్లుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు.ఎఫ్‌ 3 వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలకు సాధ్యం అయ్యేలా లేదు.

సీక్వెల్‌కు ఇప్పటికే వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.వీరిద్దరి డేట్లు కలిసే సమయంకు సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఎఫ్‌ 3 ప్లాన్స్‌ తలకిందులు చేసిన వెంకటేష్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతా బాగానే ఉంది, త్వరలోనే షూటింగ్‌కు వెళ్తామని అనీల్‌ రావిపూడి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఎఫ్‌ 3 ఆలస్యం అయ్యేలా ఉంది.అందుకు కారణం వెంకటేష్‌ అంటూ కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నారప్ప సినిమాను వెంకీ పూర్తి చేయాల్సి ఉంది.ఆ సినిమా షూటింగ్‌ను మరో మూడు నాలుగు నెలల వరకు ప్రారంభించే అవకాశాలు లేవని అంటున్నారు.

కరోనా భయం మరియు రానా వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉన్న కారణంగా నారప్ప సినిమాను వాయిదా వేశారు.వెంకీ మూవీ నారప్ప పూర్తి అయితే తప్ప ఎఫ్‌ 3 ప్రారంభం అవ్వదు.

కనుక వచ్చే ఏడాది వరకు షూటింగ్‌కు కూడా ఎఫ్‌ 3 వెళ్లే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో అనీల్‌ రావిపూడి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Venkatesh F3 Varun Tej Anil Ravipudi 3 Related Telugu News,Photos/Pics,Images..

footer-test