'దృశ్యం 2' ను దసరాకు రెడీ చేస్తున్న వెంకీ!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.ఈయన ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.

 Venkatesh Drushyam 2 Movie Latest Update, Venkatesh, Drushyam 2, F3, Meena, Duss-TeluguStop.com

అటు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఇటు సోలో హీరోగా కూడా చేస్తూ దూసుకు పోతున్నాడు.ప్రెసెంట్ వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో దృశ్యం 2 కూడా ఒకటి.

ఈ సినిమా మలయాళ దృశ్యమ్ 2 సినిమాకు రీమేక్ గా అదే పేరుతొ తెరకెక్కుతుంది.

ఈ సినిమాను జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.కానీ కరోనా వల్ల థియేటర్స్ లోకి రాలేకపోయింది.

అయితే ఈ మధ్య ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కానీ మళ్ళీ నిర్మాతలు తమ ఆలోచన మార్చుకుని థియేటర్స్ లోకి రావడానికి సిద్ధం అయినట్టు టాక్ వినిపిస్తుంది.

Telugu Drushyam, Dussehra, Meena, October, Venkatesh-Movie

అయితే ఈ సినిమాను దసరా సీజన్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు తాజా సమాచారం.ఆర్ ఆర్ ఆర్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ సినిమా విడుదల కావాలనుకున్న డేట్ కె దృశ్యం 2 సినిమాను తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అక్టోబర్ 13న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు టాక్.ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.

Telugu Drushyam, Dussehra, Meena, October, Venkatesh-Movie

ఇక ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా మాలీవుడ్ లో సూపర్ హిట్ అవవడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక వెంకటేష్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube