ఆ విషయంలో వెంకీ మామను చూసి యంగ్‌ హీరోలు చాలా నేర్చుకోవాలి

ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణలు ఏడాదికి అర డజనుకు పైగా సినిమాలు చేసిన సందర్బాలు ఉన్నాయి.ఒకానొక సందర్బంలో ఏడాదికి పది సినిమాలకు మించి ఈ స్టార్‌ హీరోలు విడుదల చేశారు.

 Venkatesh Doing The Yearly Four Movies , Venkatesh, F3 Movie, Narappa Movie Shoo-TeluguStop.com

కాని కాలం మారింది, పరిస్థితులు మారాయి.దర్శకులు ఏక కాలంలో ఒక్కటే సినిమాను తీస్తున్నారు.

హీరోలు కూడా సాహసం చేయాలనుకోవడం లేదు.సింపుల్‌ గా సినిమాలు చేస్తూ ఒక్కో క్కటి చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

అలా ఏడాదికి ఒకటి రెండు మాత్రమే సినిమాలను హీరోలు చేస్తూ వస్తున్నారు.కాని కొందరు హీరోలు ఇప్పటికి కూడా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు.

ఈ ఏడాది వెంకటేష్‌ నుండి ఏకంగా నాలుగు సినిమాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

Telugu Drishyam, Drushyam, Ppa, Venkatesh-Movie

వెంకటేష్ ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్‌ ను ముగింపు దశకు చేర్చాడు.ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం షూటింగ్‌ ను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.ఇక ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి అవుతుంది.

ఏప్రిల్‌ లేదా మే నెల వరకు ఎఫ్ 3 సినిమా షూటింగ్‌ ముగిసే అవకాశం ఉందని అంటున్నారు.ఈ రెండు సినిమా ల విడుదల తేదీల విషయమై క్లారిటీ వచ్చేసింది.

విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించడంతో పాటు వెంకీ మరో రెండు సినిమాలను కూడా లైన్‌ లో ఉంచాడు.తాజాగా ధృశ్యం 2 సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఆ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నాం అని, కేవలం రెండు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ చెప్పుకొచ్చారు.ఈ మూడు సినిమాలు కాకుండా మరోటి కూడా చర్చల దశలో ఉంది.

ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న వెంకటేష్‌ ను చూసి అయిన యంగ్‌ హీరోలు ఆదర్శంగా తీసుకుని వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube