అందరు తగ్గుతున్నా.. దృశ్యం 2 మేకర్స్ మనసు మారడం లేదు

వెంకటేష్‌ హీరోగా రూపొందిన నారప్ప సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.థియేటర్ ల ద్వారా వస్తుందని ఆశించిన నారప్ప సినిమా ను ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ రిలీజ్ చేయడం జరిగింది.

 Venkatesh Dhrushyam 2 Movie Ott Release , Drushyam2, Movie News, Narappa, News I-TeluguStop.com

ఓటీటీ లో విడుదల అయిన నారప్పకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే ఖచ్చితంగా 50 నుండి 60 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసి ఉండేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నారప్ప ఓటీటీకి వెళ్లి తప్పు చేశారు అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ఉన్నాయి.ఈ సమయంలో దృశ్యం 2 ను కూడా ఓటీటీ లోనే విడుదల చేయబోతున్నట్లుగా సురేష్ బాబు అంటున్నాడు.

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు దృశ్యం 2 ను భారీ మొత్తానికి కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు మరియు థియేట్రికల్‌ ఎక్స్‌ పీరియన్స్ ను మిస్ చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Drushyam, Ppa, Telugu, Ott-Movie

థియేటర్లు లేని సమయంలో ఓటీటీకి వెళ్లేందుకు సిద్దం అయిన పలువురు నిర్మాతలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ను క్యాన్సిల్‌ చేసుకుని థియేట్రికల్‌ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 సినిమా ను మేకర్స్ ఇప్పటికే ఓటీటీకి ఇచ్చినా కూడా వారు క్యాన్సిల్‌ చేసుకుని థియేట్రికల్‌ రిలీజ్ కు అవకాశం ఉన్నా కూడా తెలుగు సినిమాను ఓటీటీ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. సురేష్ బాబు దృశ్యం 2 కు ఓటీటీ ద్వారా వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో థియేటర్‌ ద్వారా రావు అనే అభిప్రాయంతో ఉన్నాడట.అందుకే దృశ్యం 2 ను మేకర్స్ ఓటీటీ నుండి మార్చే లా మనసు మారడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రికార్డ్‌ బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకం మాకు లేదు.అందుకే దృశ్యం 2 ను ఓటీటీలోనే విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.

దృశ్యం 2 విడుదల తేదీని ఒకటి రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube