పారితోషికం పెంచేసిన విక్టరీ వెంకటేష్  

Venkatesh Demand 10 Crores Remuneration - Telugu F2, F3 Movie, Telugu Cinema, Tollywood,

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్న విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ, లవ్ స్టొరీ కంటెంట్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి.ఇక స్టార్ హీరోగా మారిన కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోలు తమ సినిమాలతో కలెక్ట్ చేస్తున్న స్థాయిలో కూడా అతని సినిమాలు కలెక్ట్ చేయలేదు.

 Venkatesh Demand 10 Crores Remuneration - Telugu F2 F3 Movie Cinema Tollywood

దీంతో వెంకీ ఇక హీరోయిజం పక్కన పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అనే డిమాండ్ వినిపించింది.అయితే మళ్ళీ వరుసగా గురు, ఎఫ్2, వెంకీ మామ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

 Venkatesh Demand 10 Crores Remuneration - Telugu F2 F3 Movie Cinema Tollywood

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.దీని తర్వాత అని రావిపూడి ఎఫ్3 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్లాన్ లో ఉన్నాడు.ఈ సినిమా కథని ఇప్పటికే అనిల్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే వెంకటేష్ మార్కెట్ కూడా పెరగడంతో తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచినట్లు తెలుస్తుంది.ఎఫ్ 3 సినిమా కోసం దిల్ రాజుని ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ వెంకటేష్ డిమాండ్ చేసాడని టాక్ నడుస్తుంది.ఎఫ్2 సినిమతో వంద కోట్లు జేబులో వేసుకున్న దిల్ రాజు ఈ వెంకటేష్ చెప్పిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Venkatesh Demand 10 Crores Remuneration Related Telugu News,Photos/Pics,Images..