సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి.దగ్గుబాటి రామానాయుడు( Rama Naidu ).
ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈయన వారసులుగా వెంకటేష్ ( Venkatesh ) హీరోగా ఇండస్ట్రీలోకి రాగా సురేష్ బాబు( Suresh Babu ) నిర్మాతగా స్థిరపడ్డారు.
ఇలా నిర్మాతగా సురేష్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయగా వెంకటేష్ ఎన్నో మంచి సినిమాలలో నటించి హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.వెంకటేష్ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నారు.
ఇకపోతే వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.మీరు పెద్ద కుమార్తె ఆశ్రితకు వివాహం చేశారు.అశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ ( Infiniti PLatter) పేరుతో తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది.ఈమె కూడా ఫుడ్ వ్లాగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
అలాగే తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు పోస్టులకు రిప్లై ఇస్తూ ఉంటారు.