వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్..! ఎప్పుడో తెలుసా.? అసలైతే సెప్టెంబర్ లోనే అవ్వాలి కానీ..!   Venkatesh Daughter Ashritha Marriage Date Fixed     2018-11-06   08:07:05  IST  Sainath G

చాలా కాలం తరువాత దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెంకటేష్ పెద్ద కూతురి ఆశ్రిత వివాహం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత కు జాతకం కుదిరిందనివివాహంకు సంబందించినదాదాపు మాట ముచ్చట అయిపోయిందని టాక్ వచ్చింది.

రీసెంట్ గా ఇరు కుటుంబాల సన్నిహితుల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం నవంబర్ 24న పెళ్లికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అసలైతే సెప్టెంబర్ లోనే పెళ్లి జరగాలి కానీ ఎందుకు వాయిదా పడిందో తెలీదు.వరుడికుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువులు అన్నట్లు తెలుస్తోంది. సినిమా ఫీల్డ్,బిజినెస్ అండ్పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఇరు కుటుంబాల నుంచి ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం.