ముగింపును ముగించేసిన నారప్ప  

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

TeluguStop.com - Venkatesh Completes Climax Shoot For Naarappa

ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు వెంకటేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాతో ఫేడవుట్ అయిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తిరిగి సక్సె్స్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా షూటంగ్‌లో భాగంగా క్లైమాక్స్‌కు సంబంధించిన చిత్రీకరణను ఇటీవల వెంకటేష్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - ముగింపును ముగించేసిన నారప్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్లైమాక్స్ సీన్‌లో వెంకటేష్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ క్లైమాక్స్ సీన్‌లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా కేవలం వెంకటేష్‌కు సంబంధించిన షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేయడంతో, మిగతావారితో షూటింగ్‌ను తరవాత నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ రఫ్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తోండగా ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరి నారప్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Venkatesh #Naarappa #Priyamani #Srikanth Addala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు