సెప్టెంబర్ 20.. దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నుంచి అదిరిపోయే అప్డేట్!

సెప్టెంబర్ 20వ తేదీ దగ్గుబాటి హీరోలకు ఎంతో ప్రత్యేకమైన రోజు.ఎందుకంటే సెప్టెంబర్ 20వ తేదీ దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ తను నటించబోయే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది.

 Venkatesh And Rana Looks From Drushyam 2 And Bheemla Nayak Will Release September 20-TeluguStop.com

అదే విధంగా అదే రోజు అబ్బాయి రానా తన కొత్త సినిమా నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20వ తేదీ దగ్గుబాటి అభిమానులకు అటు బాబాయ్, ఇటు అబ్బాయి ఇద్దరూ కలిసి పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబాయ్.అబ్బాయ్ ఇద్దరూ కలిసి మలయాళంలో సూపర్ హిట్ చిత్రాలకు రీమేక్ చిత్రాలుగా నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ రావడం గమనార్హం.

 Venkatesh And Rana Looks From Drushyam 2 And Bheemla Nayak Will Release September 20-సెప్టెంబర్ 20.. దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నుంచి అదిరిపోయే అప్డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే వెంకటేష్ మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి దృశ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్నటువంటి “దృశ్యం 2 “చిత్రంలో కథానాయకుడు రాంబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.ఈ పోస్టర్ సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నారు.

Telugu Bheemla Nayak, Bits Of Daniel Sekhar Look, Drushyam 2, Rana, Rana Daniel Sekhar Look, Tollywood, Venkatesh, Venkatesh Rambabu Look-Movie

అదేవిధంగా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న “అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్” కి రీమేక్ గా తెలుగులో వస్తున్నటువంటి భీమ్లా నాయక్ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పాత్రలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20వ తేదీ డానియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను బ్లిట్స్ ఆఫ్ డేనియ‌ల్ శేఖ‌ర్ పేరుతో గ్లింప్స్ గా విడుదల చేయబోతున్నారు.ఇలా ఒకే రోజు అబ్బాయ్.

బాబాయ్ సినిమాల నుంచి అప్డేట్స్ రావడంతో వీరి అభిమానులకు నిజంగా పండుగ రోజుని చెప్పవచ్చు.

#Drushyam #Bheemla Nayak #Venkatesh #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు