సంక్రాంతి బరిలోకి దిగబోతున్న F3.. కన్ఫర్మ్ చేసిన వెంకీమామ !

టాలీవుడ్ లో పండగలకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ.అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే మన హీరోలందరికీ ఇష్టం అప్పుడు సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల సునామీ రావడం ఖాయం కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి.

 సంక్రాంతి బరిలోకి దిగబోతున్న F3.. కన్ఫర్మ్ చేసిన వెంకీమామ !-TeluguStop.com

అందుకే సంక్రాంతి పండుగకు ముందుగానే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.

అయితే 2022 సంక్రాంతి బరిలోకి ఇప్పటి నుండే పోటీ మొదలయ్యింది.

 సంక్రాంతి బరిలోకి దిగబోతున్న F3.. కన్ఫర్మ్ చేసిన వెంకీమామ !-సంక్రాంతి బరిలోకి దిగబోతున్న F3.. కన్ఫర్మ్ చేసిన వెంకీమామ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈసారి సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండేట్టు ఉంది.ఎందుకంటే కరోనా కారణంగా ఇప్పటి వరకు థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో సినిమాలు అన్ని విడుదల అవ్వకుండా అలాగే ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

Telugu Anil Ravipudi, Dil Raju, F3 Movie, Mehreen Kaur Pirzada, Sankranthi 2022, Tamannaah, Varun Tej, Venkatesh, Venkatesh Adds Fun N Frustration To Sankranthi 2022-Movie

ఎలాగూ చిన్న సినిమాలు దైర్యం చేసి సంక్రాంతికి పోటీ పడవు.అందుకే పెద్ద సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో ఉంటాయి.వాటిల్లో ఇప్పుడు F3 సినిమా చేరిపోయింది.

మొన్నటి వరకు ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వబోతుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వెంకటేష్ F3 సినిమా సంక్రాంతి బరిలోనే ఉండబోతుందని ఇంటర్వ్యూ లో తెలిపాడు.

Telugu Anil Ravipudi, Dil Raju, F3 Movie, Mehreen Kaur Pirzada, Sankranthi 2022, Tamannaah, Varun Tej, Venkatesh, Venkatesh Adds Fun N Frustration To Sankranthi 2022-Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈసారి ఎఫ్ 3 తో కడుపుబ్బా నవ్వించడానికి వెంకటేష్, వరుణ్ తేజ్ రెడీ అయ్యారు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.నారప్ప ప్రమోషన్స్ లో వెంకటేష్ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రాబోతుందని కన్ఫర్మ్ చేసాడు.

#Anil Ravipudi #MehreenKaur #Varun Tej #Dil Raju #Sankranthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు