వెంకటేష్‌ 75వ సినిమాను అలా ప్లాన్‌ చేస్తున్నారట

సీనియర్‌ స్టార్‌ హీరోలు 100 సినిమాలకు చేరుకోగా వెంకటేష్‌ మాత్రం ఇంకా 75 సినిమాలు కూడా చేయలేదు.కెరీర్‌ ఆరంభం నుండి కాస్త మెల్లగానే సినిమాలు చేస్తూ వచ్చిన వెంకీ త్వరలోనే తన 75వ సినిమా చేస్తున్నాడు.

 Venkatesh 75 Movie Plan To Two Directors-TeluguStop.com

వెంకీమామ సినిమా వెంకటేష్‌ కెరీర్‌లో 73వ సినిమా.ఆయన 74వ సినిమా అసురన్‌ రీమేక్‌.

ఇంకా అసురన్‌ రీమేక్‌ ప్రారంభం అవ్వకుండానే అప్పుడే వెంకీ 75వ సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయి.అసురన్‌ సినిమాను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయబోతున్నారట.

Telugu Anilravipudi, Venkatesh, Venkateshtharun, Venkateshvenky, Vnkateshtamil-

అసురన్‌ పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే ఏడాది సమ్మర్‌లో వెంకీ 75వ సినిమా పట్టాలెక్కించేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఏర్పాట్లు చేస్తున్నారు.వెంకీ 75వ సినిమా కోసం ఇద్దరు దర్శకులను ప్రముఖంగా సంప్రదిస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకీ 75వ సినిమా ఉంటుంది ఒక వేళ అనీల్‌ రావిపూడి కాదంటే తరుణ్‌ భాస్కర్‌ చెప్పిన కథతో వెంకీ 75వ సినిమా చేసే అవకాశాలున్నాయి.

Telugu Anilravipudi, Venkatesh, Venkateshtharun, Venkateshvenky, Vnkateshtamil-

ప్రస్తుతం వీరిద్దరు కూడా వెంకీ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయితే అనీల్‌రావిపూడి దొరకడం కష్టమే అనే వారు కొందరు ఉన్నారు.అయితే ఇప్పటి వరకు సురేష్‌ బాబు నుండి అనీల్‌ రావిపూడికి అడ్వాన్స్‌ ఏమీ అందలేదని, సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తి అయిన తర్వాత విడుదల తర్వాత అనీల్‌ రావిపూడి తదుపరి చిత్రం గురించి మాట్లాడాలని భావిస్తున్నాడట.

వెంకీ 75ను చేసేది ఎవరో సంక్రాంతి తర్వాత తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube