విడ్డూరం : చనిపోయాడని అంత్యక్రియలు చేశారు, కాని కొన్ని రోజులకు తిరిగి వచ్చాడు

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి వచ్చాడు అంటూ గతంలో మనం చాలా వార్తల్లో చదివాం.కాని చనిపోయాడు అనుకుని ఒక శవంకు అంత్యక్రియలు చేసి, పిండ ప్రధానం చేసిన తర్వాత ఆ వ్యక్తి బతికి వస్తే పరిస్థితి ఎలా ఉంటోందో ఒకసారి ఊహించుకోండి.

 Venkat Rao Return Home Some Other Days-TeluguStop.com

సరిగ్గా ఇదే సంఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగింది.పొట్లపాడు గ్రామానికి చెందిన వెంకటరావు కూలి పని నిమిత్తం వారం పది రోజులు ఊర్లు పట్టుకుని వెళ్తూ ఉంటాడు.

ఆ క్రమంలో ఆయన శవం ఒక చెరువులో లభించింది అంటూ పోలీసులు వెంకటరావు కుటుంబ సభ్యులను పిలిచించడం జరిగింది.

Telugu Martam, Telugu General, Telugu, Venkatrao, Venkatarao, Venkatrao Days-Lat

వెంకటరావు భార్య అంజనాదేవి మొదట ఆ డెడ్‌ బాడీని చూసి తన భర్తది కాదంది.కాని పిల్లలు మరియు గ్రామస్తులు కొందరు అది వెంకటరావు డెడ్‌ బాడీ అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.నిటీలో రెండు మూడు రోజులు ఉండటం వల్ల బాడీ బాగా ఉబ్బి మొహం గుర్తు పట్టలేకుండా ఉంది.

దాంతో అంజనాదేవి కూడా తన భర్త అనుకుని అంత్యక్రియలకు సిద్దం అయ్యింది.కుటుంబం మొత్తం కూడా ఏడ్చి ఏడ్చి అంత్యక్రియలు నిర్వహించారు.పోలీసు వారు పోస్ట్‌ మార్టం చేసి అంజనాదేవికి కాస్త అనుమానం ఉన్నా కూడా బలవంతంగా వారికి అప్పగించారు.

Telugu Martam, Telugu General, Telugu, Venkatrao, Venkatarao, Venkatrao Days-Lat

తీరా అంత్యక్రియలు అయిపోయి కొన్ని రోజులు గడుస్తుండగా వెంకటరావు బతికే ఉన్నట్లుగా సమాచారం వచ్చింది.తెలిసిన వ్యక్తి వీడియో పంపడంతో ఆ వీడియోలో ఉన్నది వెంకటరావు అని గుర్తించి అతడు ఉన్న గ్రామానికి వెళ్లడం జరిగింది.అక్కడ వెంకటరావును చూడగానే అంజనాదేవి ఆనందంకు అవదులు లేవు.

ఆమె భర్త బతికే ఉండటం చూసి కన్నీరు పెట్టుకుంది.మొదటి నుండి ఆమెకు ఉన్న అనుమానం నిజమే అయ్యింది.

Telugu Martam, Telugu General, Telugu, Venkatrao, Venkatarao, Venkatrao Days-Lat

ఆ వ్యక్తి తన భర్త కాడు అనుకుంది.కాని గ్రామస్తులు అంతా కూడా ఒప్పించారు.అయితే ఆ శవం ఎవరిది అనేది ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఉన్నతాధికారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆమె తన భర్త కాదని చెప్పినా కూడా ఆమెను బలవంతంగా ఒప్పించి ఎందుకు ఆమెకు డెడ్‌ బాడీ అప్పగించారు అంటూ స్టేషన్‌ పోలీసులను మందలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube