ఉప రాష్ట్రపతికి కూడా నచ్చేసిన 'నాట్యం'!

Venkaiah Naidu Said That He Will Watch The Whole Movie Of Natyam

టాలీవుడ్ లో ఈ వారంలో విడుదల అయ్యే సినిమాల్లో నాట్యం సినిమా ఒకటి.రొటీన్ కు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించమని చిత్ర యూనిట్ తెలిపింది.

 Venkaiah Naidu Said That He Will Watch The Whole Movie Of Natyam-TeluguStop.com

ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు.కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి ఆసక్తి కలిగింది.

ఇక రిలీజ్ దగ్గర పడే కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచింది.

 Venkaiah Naidu Said That He Will Watch The Whole Movie Of Natyam-ఉప రాష్ట్రపతికి కూడా నచ్చేసిన నాట్యం’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Chiranjeevi, Natyam, Natyam Release Date, Ram Charan, Sandhya Raju, Venkaiah Naidu, Venkaiah Naidu Said That He Will Watch The Whole Movie Of Natyam-Movie

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ఈ సినిమాతో నటిగా పరిచయం అవుతుంది.ఇక ఈ సినిమాను హీరోయిన్ సంధ్య రాజు నిర్మించడం కూడా ఇక్కడ విశేషం.ఈమె పారిశ్రామిక వేత్తగా చాలా మందికి సుపరిచితురాలు.

కానీ ఈమెకు నాట్యం మీద ఉన్న ఆసక్తితో ఆ నాట్యం నేపథ్యంలోనే కొత్తగా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆమే స్వయంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు కుడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాపై రామ్ చరణ్, చిరంజీవి మాట్లాడి ఈ సినిమాను అందరికి చేరువ అవ్వడంతో హెల్ప్ చేసారు.త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరి ద్రుష్టి ఆకర్షిస్తుంది.

తాజాగా సంధ్య రాజు తన సినిమాను చూడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కోరారట.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కేవలం 5 నిముషాలు చూస్తానని తెలిపారట.

Telugu Chiranjeevi, Natyam, Natyam Release Date, Ram Charan, Sandhya Raju, Venkaiah Naidu, Venkaiah Naidu Said That He Will Watch The Whole Movie Of Natyam-Movie

కానీ సినిమా మొదలైన తర్వాత సినిమాలో లీనమై అలాగే చూస్తూ మొత్తం సినిమా చూసేసారట.అంతేకాదు సినిమా చూసిన తర్వాత తనను మెచ్చుకున్నారని కూడా ఆమె చెబుతున్నారు.ఆమె సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి కాకుండా వ్యాపార రంగం నుండి వచ్చిన తనను ప్రోత్సహించిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతునాన్రు.నాట్యం సినిమాలో గురు శిష్యుల సంబంధాన్ని.

క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దుల గురించి చూపించనున్నామని తెలిపింది.మరి నాట్యం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో విడుదల అయినా తర్వాత చూడాలి.

#Ram Charan #Sandhya Raju #Venkaiah #Natyam #VenkaiahWatch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube