టీం ఇండియా చిచ్చర పిడుగులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు  

Venkaiah Naidu Congratulations To Under 19 Team India Match - Telugu India Vs Pakisthan Cricket Match, Under 19 Cricket Match, Under 19 Cricket Update, Venkaiah Naidu,

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌ 19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో టీం ఇండియా చిచ్చర పిడుగులు ఫైనల్‌కు చేరారు.వారు సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించడంతో దేశ వ్యాప్తంగా వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

Venkaiah Naidu Congratulations To Under 19 Team India Match

ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది.దాన్నే కొనసాగిస్తూ అండర్‌ 19 టీం ఇండియా జట్టు కూడా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.10 వికెట్ల తేడాతో ఈ విజయాన్ని అందుకోవడం మరో గొప్ప విషయం.

టీం ఇండియా కుర్రాళ్లు దక్కించుకున్న ఈఅద్బుత విజయం ప్రపంచ కప్‌ గెలిచినంత సంతోషాన్ని ఇచ్చింది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖులు ఎంతో మంది యువ టీం ఇండియా జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా టీం ఇండియా కుర్రాళ్లను అభినందించారు.మీరు కనబర్చిన ఆట తీరు అద్బుతం అంటూ కొనియాడారు.మశస్వి జైస్వాల్‌ మరియు దివ్యాంశ్‌ సక్సేనాలు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించి పాక్‌ను మట్టి కరిపించారు.

వారిద్దరిపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు.

తాజా వార్తలు

Venkaiah Naidu Congratulations To Under 19 Team India Match-under 19 Cricket Match,under 19 Cricket Update,venkaiah Naidu Related....