వెంకీ అభిమానులను ఊరిస్తున్న ఆ మూడు చాలా స్పెషల్‌

కరోనా కారణంగా వెంకటేష్ సినిమాలు మూడు ఆలస్యం అవుతున్నాయి.ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్‌ వేవ్‌ కారణంగా నారప్ప మరియు దృశ్యం 2 చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి.

 Venaktesh Three Movie Ready To Release-TeluguStop.com

ఈ రెండు సినిమా లు కూడా ఇతర భాషల్లో సక్సెస్‌ అయ్యాయి.ఇవి రెండు రీమేక్ లు కనుక ఖచ్చితంగా సక్సెస్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లను వచ్చే నెల విడుదల చేయబోతున్నాం అనుకుంటూ ఉండగా కరోనా ఆ సినిమా లను ఆపేసింది.మళ్లీ షూటింగ్‌ పూర్తి చేసినా కూడా విడుదల ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు.

 Venaktesh Three Movie Ready To Release-వెంకీ అభిమానులను ఊరిస్తున్న ఆ మూడు చాలా స్పెషల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు రీమేక్‌ లతో పాటు ఎఫ్ 2 కు సీక్వెల్‌ గా రూపొందుతున్న ఎఫ్‌ 3 సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతుంది.చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ను వచ్చే నెలలో పట్టాలెక్కించి రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది.

వెంకటేష్‌ దృశ్యం 2 సినిమా ను అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ చివర్లో లేదా జులై లో విడుదల చేయాలనుకున్నారు.కాని పరిస్థితి అందుకు సహకరించలేదు.ఇక నారప్ప సినిమా గురించి గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ మేకర్స్ ఊరిస్తూనే ఉన్నారు.ఎఫ్ 3 సినిమా ఇటీవలే పట్టాలెక్కినా కూడా మేకర్స్‌ ఆగస్టులోనే సినిమాను విడుదల చేయాలని భావించారు.

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ ఆ సినిమా ప్లాన్‌ ను కూడా కిందా మీద చేసినట్లుగానే అనిపిస్తుంది.మరో సారి కూడా వెంకటేష్‌ అభిమానులకు ఎదురు చూపులు తప్పేలా లేవు.

మూడు సినిమా లు కూడా వెంకటేష్ అభిమానులను ఊరించేలా చేస్తున్నాయి.

Telugu Corona Second Wave, Covid Effect, Drushyam 2 Movie, F3 Movie, Film News, Narappa, Ready To Release, Venkatesh, Venkatesh Fans, Venkatesh Latest Movies, Venkatesh Three Movies-Movie

ఈ మూడు సినిమా లు కూడా చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దృశ్యం ఇప్పటికే సక్సెస్‌ అయ్యింది కనుక దృశ్యం 2 ఖచ్చితంగా సూపర్‌ హిట్‌.ఇక నారప్ప సినిమా కూడా రీమేక్‌.

కనుక నారప్ప సినిమా షూటింగ్‌ మొదలు అయినప్పటి నుండే సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి.ఇక ఎఫ్ 2 సక్సెస్ కనుక ఎఫ్‌ 3 మరో లెవల్‌ లో ఉంటుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.

#Venkatesh Fans #Covid Effect #Narappa #VenkateshLatest #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు