'నారప్ప' థియేట్రికల్‌ రిలీజ్ సాధ్యమా?

తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్‌ ను తెలుగు లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా నారప్పగా రీమేక్ చేయడం జరిగింది.సురేష్ బాబు ఈ సినిమా ను ఒరిజినల్ నిర్మాత అయిన కళై పులి ఎస్ థాను తో కలిసి నిర్మించారు.

 Venaktesh Srikanth Addala Movie Narappa Theaters Release Update, Film News, Sure-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ అయ్యి ముగిసిన వెంటనే విడుదల చేయాలని భావించినా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.గత ఏడాది విడుదల అవ్వాల్సిన నారప్ప కాస్త ఈ ఏడాదికి వాయిదా పడింది.

ఎట్టకేలకు సినిమా విడుదల అయ్యింది.అయితే కరోనా కారణంగా ఆలస్యం అయిన సినిమా ను చివరకు ఓటీటీ లోనే విడుదల చేశారు.

ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారప్ప సినిమా షూటింగ్‌ మొదలు పెట్టినప్పటి నుండి కూడా భారీ అంచనాలు కలిగి ఉంది కనుక అభిమానులు థియేటర్లలో చూడాలని ఆశ పడ్డారు.ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యింది కనుక అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పునః ప్రారంభంకు అంతా ఓకే అయ్యింది.కనుక ఈ సమయంలో నారప్ప ను థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనే అబిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కనీసం 150 నుండి 200 థియేటర్లలో ఈ సినిమాను వారం రోజుల పాటు ఆడిస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.కాని అది ఎంత వరకు సాధ్యం అనేది మాత్రం క్లారిటీ లేదు.

Telugu Asuran, Ppa Theaters, Ppa, Ott, Prime, Suresh Babu, Telugu Theaters, Venk

ఓటీటీ లో విడుదల అయిన సినిమా లు గత ఏడాది మొదటి లాక్ డౌన్ తర్వాత థియేటర్లోల విడుదల అయ్యాయి.కాని అవి పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి.అయినా కూడా నారప్ప ను థియేటర్లలో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాని సురేష్ బాబు వ్యాఖ్యల నేపథ్యంలో నారప్ప థియేటర్ రిలీజ్ అసాధ్యంగా తేలిపోయింది.అభిమానులు నారప్ప సినిమా థియేటర్ రిలీజ్ కోసం ఆశలు పెట్టుకోవడం వృదానే అంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube