ఐఎండీబీలో 'నారప్ప'కు అరుదైన ఘనత

తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన అసురన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో ధనుష్ లుక్‌ ఆకట్టుకుంది.

 Venaktesh Narappa Movie Get Big Rating In Imdb-TeluguStop.com

ఆ సినిమా ను వెంకటేష్ రీమేక్‌ చేస్తాను అంటూ ప్రకటించినప్పుడు అంతా కూడా ముక్కున వేలేసుకుంటారు.ధనుష్ పోషించిన ఆ పాత్రను వెంకటేష్‌ పోషించగలడా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఆ కాస్ట్యూమ్స్ లో వెంకీ కనిపించి మెప్పించగలడా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి.కాని అసురన్ ను తెలుగు లో నారప్పగా విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

 Venaktesh Narappa Movie Get Big Rating In Imdb-ఐఎండీబీలో నారప్ప’కు అరుదైన ఘనత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓటీటీ విడుదల అయిన నారప్ప కు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇప్పటికే నారప్ప సినిమా లో వెంకీ నటనకు ఫిదా అవుతూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే వెంకటేష్ నారప్ప కు అరుదైన ఘనత దక్కింది.

సాదారణంగా ఒరిజినల్ వర్షన్ కు వచ్చినంత రేటింగ్‌ డబ్బింగ్ సినిమాకు రావడం చాలా చాలా తక్కువ. ఐఎండీబీలో అసురన్‌ కు 8.5 రేటింగ్ దక్కగా నారప్పకు కూడా అదే రేంజ్ లో రేటింగ్‌ ను జనాలు ఇచ్చారు. నారప్ప రేటింగ్ పట్ల అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అసురన్‌ మరియు నారప్ప లకు ఒకే తరహాలో ఈ రేంజ్ లో రేటింగ్‌ రావడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా రేటింగ్ విషయమై వెంకీ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.నారప్ప సినిమా రేటింగ్‌ మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్ లో రేటింగ్‌ రావడం అరుదు.అందుకే నారప్ప సినిమా గొప్ప అంటూ వెంకీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Dhanush #Asuran Remake #Priyamani #NarappaMovie #Venaktesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు