మీ బండిపై పోలీస్‌ లేదా ప్రెస్‌ అని రాయించుకున్నారా... వెంటనే తీసేయించుకోండి లేదంటే అంతే  

ముఖ్యమైన పట్టణాల్లో లేదా నగరాల్లో వాహనదారులను పోలీసులు పదే పదే చెక్‌ చేస్తూ ఉంటారు. భద్రతా కారణాల దృష్ట్యా లైసెన్స్‌, ఆర్సీ, హెల్మెట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటూ పోలీసులు సూచిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది లైసెన్స్‌ లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు ప్రమాదాలకు గురైతే ప్రమాధ భీమా ఉండదు. అందుకే లైసెన్స్‌ వంటివి తప్పనిసరిగా ఉండాల్సిందే అంటూ పోలీసులు గట్టి నిబంధనలు తీసుకు వచ్చారు. నిబంధనలను అతిక్రమించిన వారికి చలానాలు కూడా విధిస్తున్నారు. అయితే వీటిని తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ప్రెస్‌ మరియు పోలీస్‌ అంటూ రాసుకుంటారు.

పోలీసు అని రాసి ఉన్న వాహనాలను పోలీసులు ఆపరు. తమ వారే కదా అనే ఉద్దేశ్యంతో బండ్లను వదిలేస్తారు. అందుకే ఒక ఇంట్లో ఒక పోలీసు ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారు అంతా కూడా తమ బండ్లపై పోలీస్‌ అని రాయించుకుంటూ ఉంటారు. కొందరు బంధువులు కూడా పోలీసు అని రాయించుకుని తమ వాడు పోలీస్‌ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇంకొందరు మాత్రం పోలీసులతో సంబంధం లేకుండానే పోలీస్‌ అని రాసుకుంటారు. ఇక ప్రెస్‌ లో జాబ్‌ చేసే వారు, జాబ్‌ చేయని వారు కూడా ప్రెస్‌ అంటూ తమ వాహనాలపై రాసుకుని ఉంటారు. దాంతో పోలీసులకు ఏ వాహనం ఆపాలో ఏ వాహనం ఆపకూడదో అర్థం అవ్వడం లేదు.

Vehicles With Press Police And Indian Armed Is Traffic Offence-Stickers On Traffic Offence

Vehicles With Press Police And Indian Armed Is Traffic Offence

దాంతో పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు. పోలీసు లేదా ప్రెస్‌ అంటూ రాసుకుని కనిపించిన వాహనాలను మొదటి సారి ఆపుతారు. ఆ వాహనంపై ఉన్న వ్యక్తి పోలీస్‌ లేదా ప్రెస్‌కు సంబంధించిన వారు అయితే కార్డ్‌ చూపించాల్సి ఉంటుంది. ప్రెస్‌ వారు ఖచ్చితంగా అక్రిడేషన్‌ కార్డును చూపించాలి. మొదటి సారి పట్టుబడితో వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తారు. రెండవ సారి మళ్లీ పట్టుబడితే మాత్రం బండిని సీజ్‌ చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలకు సిద్దమవుతారట.

Vehicles With Press Police And Indian Armed Is Traffic Offence-Stickers On Traffic Offence

అందుకే మీ వాహనాలపై పోలీస్‌ లేదా ప్రెస్‌ అని ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ప్రెస్‌ వారికి అక్రిడేషన్‌ ఉంటే పర్వాలేదు, పోలీసు వారు ఐడీ కార్డు చూపిస్తే ఒప్పుకుంటారు. కాని ఇతరులు ఆ స్టిక్కర్లతో కనిపిస్తే మాత్రం అంతే..!