వచ్చేనెలలో మరింత జోరు పెరగనుంది..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం అయితే మరింత నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి.

 Demand For Vehicles Increased,vehicles, July, Two Wheeler Vehicles, Showroom, Lo-TeluguStop.com

కరోనా సంక్షోభంలో వినియోగదారులు ఎవరు కూడా వాహనాలను కొనేందుకు అంతగా ఆసక్తి చూపలేదు.కాగా వచ్చే నెలలో వాహన అమ్మకాలు పుంజుకోవడం ఖాయం అని డోలాట్ క్యాపిటల్ చెబుతోంది.

లాక్‌డౌన్‌ అన్లాక్ తర్వాత ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో వినియోగదారులు ఆటో షో రూమ్ లని సందర్శిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని డోలక్ క్యాపిటల్ చెప్పుకొచ్చింది.అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రస్తుతం ఆటో షోరూమ్ లని సందర్శిస్తున్న వారి సంఖ్యను పెంచుతుంది తాజా నివేదికలో తెలిపింది.

అంతేకాకుండా ప్రస్తుతం సకాలంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో.ప్రస్తుతం వ్యవసాయ పనులు ఒక్కసారిగా ఊపందుకోవడంతో వాహనాలకు డిమాండు పెరిగే అవకాశం ఉంది అంటూ తెలిపింది.

జూలై నెల నాటికి ఈ వాహనాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం టు వీలర్ వాహనాలకు డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ… ఫోర్ వీలర్ వాహనాల డిమాండ్ గురించి మాత్రం తెలియాల్సి ఉంది అంటూ పేర్కొంది డోలాట్ క్యాపిటల్ సంస్థ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube