శాకాహారులకి ఉన్న పెద్ద ప్రమాదం ఇదే

ఒంట్లో ఐరన్ కంటెంట్ సరిగా లేకపోతే రక్తలేమి సమస్య వస్తుంది.ఈ సమస్య వస్తే ఎన్ని సమస్యలో చెప్పాల్సిన పని లేదు.

 Vegetarians Are In Trouble Of Anaemia – Study-TeluguStop.com

ఈ రక్తహీనత సమస్యనే అనేమియా అని అంటారు.మహిళల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది.59% స్త్రీలలో ఈ సమస్య ఉంటుందట.గర్భిణీలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారట.21% పిల్లల్లో కూడా రక్తహీనత చూడొచ్చు.ఇక ఎవరైనా సరే, కూరగాయల మీద ఆధారపడే శాకహారులు కూడా ఈ సమస్య వలన ఇబ్బంది పడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

చాలావరకు వెజిటబుల్స్ లో ఫైటేట్స్ ఉంటాయి.ఇవి ఐరన్ ని మన శరీరం అబ్జర్వ్స్ చేసుకోకుండా అడ్డుకుంటాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది.శాకహారులు వెజిటబుల్స్ తోపాటు విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఐరన్ శరీరంలో బాగా చేరుతుంది అంట.

హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూట్రిషన్ ఫాతిమా తాహేర్ అలీ ఈ విషయం మీద మాట్లాడుతూ ” మేము చాలారోజులుగా చెబుతున్నాం.వెజిటబుల్స్ లో ఉండే ఐరన్ ని శరీరం బాగా ఉపయోగించుకోవాలంటే విటమిన్ సి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలి.

అప్పుడే రక్తం బాగా పుడుతుంది ” అని చెప్పారు.

పెద్దగా ప్రచారం పొందని సమస్య అయినా, సీరియస్ గా తీసుకోవాల్సిన సమస్య ఇది.కాబట్టి ఐరన్ ఉన్న అహారం, దాంతోపాటు విటమిన్ సి ఉన్న ఆహారంతో డైట్ బాగా ప్లాన్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube