సాధారణంగా కూరగాయలను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.ఈ విషయం అందరికి తెలిసిందే.
అయితే మనం చాలా కూరగాయలను ఉడికించి తింటాం.అయితే కొన్ని కూరగాయలను పచ్చిగానే తింటాం.
అయితే కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు.ఉడికించి మాత్రమే తినాలి.
ఒకవేళ పచ్చిగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల పచ్చి కూరగాయలు ఏమి తినకూడదో వివరంగా తెలుసుకుందాం.
క్యాలీఫ్లవర్
క్యాలీఫ్లవర్ ని పచ్చిగా తినకూడదు.ఉడికించుకొని మాత్రమే తినాలి.
పచ్చిగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.అలాగే దీనిలో లభించే పోషకాలు ఉడికిస్తే ఎక్కువగా శరీరానికి అందుతాయి.
మొలకెత్తిన విత్తనాలు
ఈ రోజుల్లో చాలా మంది మొలకెత్తిన గింజలను పచ్చిగానే తింటున్నారు.ఆలా తినటం వలన వాటిలో ఉండే రసాయనాలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలా ప్రేరేపిస్తాయి.అందువల్ల ఉడికించి తింటేనే మంచిది.
వంకాయ
వంకాయలో సొలనైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి శరీరంలో విషాలను విడుదల చేస్తాయి.అందువల్ల పచ్చిగా తినకూడదు.వీటికి ఉడికించినప్పుడు సొలనైన్ అనే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది.
పుట్ట గొడుగులు
చాలా మంది పుట్ట గొడుగులు పచ్చిగా తినేస్తూ ఉంటారు.వాటిలో ఉండే విష పదార్ధాలు ప్రమాదకర పరిస్థితిని కలిగిస్తాయి.వీటిని బాగా ఉడికించుకొని మాత్రమే తినాలి.బాగా ఉడికించటం వలన వాటి ప్రభావం తగ్గుతుంది.
బంగాళాదుంప
బంగాళాదుంపను ఖచ్చితంగా ఉడికించుకొని మాత్రమే తినాలి.ఎందుకంటే పచ్చిగా తింటే వాటిలో ఉండే పిండి పదార్ధాలు తొందరగా జీర్ణం కాక జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.అంతేకాక గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.