వైరల్ .. కె ఎఫ్ సి రెస్టారెంట్ మొత్తం రక్తంతో నింపిన యువతి..ఎందుకంటే ?

రెస్టారెంట్ కు ఎవరైనా ఎందుకు వెళ్తారు.మంచి మంచి ఫుడ్ తినడానికే కదా.

 Vegan Protesters Storm Restaurant And Pours Fake Blood Everywhere In Australia M-TeluguStop.com

కానీ ఒక యువతీ మాత్రం కె ఎఫ్ సి రెస్టారెంట్ కు వెళ్లి తనతో తెచ్చుకున్న రక్తాన్ని ఆ రెస్టారెంట్ మొత్తం పోసి అక్కడ కస్టమర్లతో పాటు, రెస్టారెంట్ సిబ్బందిని కూడా భయ భ్రాంతులకు గురి చేసింది.అసలు ఆ యువతీ ఎవరు.

ఎందుకు ఆ రెస్టారెంట్ మొత్తం అలా రక్తం చిమ్మింది.అనే విషయం తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసు కోవాల్సిందే.

రోజురోజుకూ ‘వెగన్‘ ఉద్యమం ఊపందు కుంటుంది.దీనికి తోడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ ఉద్యమ ఉపందు కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తుంది.అందుకే వెగన్ ఉద్యమం జనాలకు తొందరగా రీచ్ అయ్యింది.

వెగన్ ఉద్యమం అంటే చాలా మందికి తెలిసిందే.శాకాహార ఉద్యమం అని.జీవ హింస చేయొద్దని ఉద్యమ కారులు జనాలను హెచ్చరిస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ ఉద్యమంపై ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో కాంతామణి ఉద్యమ కారులు కె ఎఫ్ సి రెస్టరెంట్ లో నిరసన వ్యక్తం చేసారు.

ఆ రెస్టారెంట్ ను మొత్తం కొద్దిసేపు భయాందోళనకు గురి చేసింది.ఆ ఉద్యమ కారులు జంతువులను చంపుతున్న వీడియోలను ప్లే చేసి వాటి ఆర్తనాదాలు వినిపించారు.అందులో ఒక యువతి తనతో తెచ్చుకున్న రక్తాన్ని కౌంటర్ దగ్గర, ఇంకా రెస్టారెంట్ మొత్తం చల్లడంతో అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయపడ్డారు.

అయితే ఇది నిజమైన రక్తం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.శాకాహారి కాకపోతే మీరు జంతువులను హింసించినట్టే అని వారు తెలిపారు.జీవ హింసను నిర్ములించండి.

అనే నినాదంతో ఆ రెస్టరెంట్ మొత్తం హడలెత్తించారు.తర్వాత ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మొత్తానికి వెగన్ ఉద్యమం రోజురోజుకూ ఊపందుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube