బాలయ్య బాబీ కాంబో మూవీకి వీరసింహారెడ్డి కనెక్షన్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ?

స్టార్ హీరో బాలయ్య( Balayya ) కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) ఒకటి కాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనంతపూర్ లో షూట్ చేశారు.అఖండ సినిమా కూడా అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

 Veerasimhareddy Connection To Balakrishna Bobby Combo Movie Details Here Goes Vi-TeluguStop.com

అయితే బాలయ్య కొత్త సినిమా కోసం కూడా అనంతపూర్ సెంటిమెంట్ రిపీట్ కానుందని సమాచారం అందుతోంది.బాలయ్య బాబీ మూవీ కోసం అనంతపూర్ లో సెట్ వేస్తున్నారని భోగట్టా.

ఈ సెట్ లోనే మూవీ షూటింగ్ జరగనుందని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య , బాబీ ( Bobby )కాంబో మూవీకి వీరసింహారెడ్డి కనెక్షన్ జత కావడంతో బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య సినిమాలలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ ను వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.

బాలయ్య బాబీ కాంబో మూవీకి బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేవని మంచి ఔట్ పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.సితార ఎంటర్టైన్మెంట్( Sitara Entertainment ) నిర్మాతలు ఈ మూవీ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

పండుగల సమయంలో రిలీజ్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్న నేపథ్యంలో బాలయ్య తర్వాత సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయేమో చూడాలి.30 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య పారితోషికం తీసుకుంటున్నారు.బాలయ్య రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube