తొడగొడుతున్న వీరమల్లు.. టీజర్‌తో చుక్కలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత పవన్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రంలో నటిస్తున్నాడు.

 Veeramallu Teaser Highlights To Wow Fans-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను పూర్తిగా పీరియాడికల్ డ్రామాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఈ టీజర్‌ను కట్ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 Veeramallu Teaser Highlights To Wow Fans-తొడగొడుతున్న వీరమల్లు.. టీజర్‌తో చుక్కలే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ అపియరెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో వీరమల్లు పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమా టీజర్‌లో పవన్ ఓ బాడీ బిల్డర్‌ను పైకెత్తి అతడిని విసిరిపడేస్తాడని, ఈ క్రమంలో ఆయన తొడగొట్టే సీన్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మహాశివరాత్రి కానుకగా వీరమల్లు టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

బ్రిటిష్ కాలం నాటి కథనంతో ఈ సినిమా రానుండగా, ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఈ టీజర్‌తో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

#Krish #Pawan Kalyan #Veeramallu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు