అబ్బా.. ఏం ప్లాన్ వేశావమ్మా సరస్వతి! అసలు విషయం తెలిస్తే ఆమె ముఖం మీద ఉమ్మేస్తారు   Wife Hired Gang To Eliminate Husband     2018-07-18   10:50:20  IST  Sainath G

సొసైటీలో భర్తలను ఎంత క్రూరంగా చంపడం అనే కాంపిటీషన్ ఏమన్నా నడుస్తుందా.. ఇంత సీరియస్ టాపిక్ ని సిల్లీగా స్టార్ట్ చేసినందుకు సారీ..కానీ..ఏంటండీ ఇది మొన్న స్వాతి..తర్వాత జ్యోతి,శ్రీవిద్య,ఇప్పుడు సరస్వతి..ఒకరి తర్వాతగా ఒకరు తమ ప్రేమని దక్కించుకోవడం కోసం భర్తలను మట్టుపెట్టడం…పెళ్లై పదిరోజులు కాకుండానే భర్తని చంపించింది చాలక..అది కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద కథ అల్లడం ..నిజంగా సినిమాలు చూసి మనుషులు చెడిపోతున్నారా.. మనుషుల్ని చూసి సినిమాలు తీస్తున్నారా..ఇది అర్దంకాని పెద్ద సబ్జెక్ట్..ఇప్పుడు విషయం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసారనే కారణంతో భర్తని చంపిన సరస్వతి కథ..

Wife Hired Gang To Eliminate Husband-

వాస్తవం ఏంటంటే సరస్వతికి పెళ్లికి ముందే శివ అనే వ్యక్తిని ప్రేమించింది.పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో తనే దగ్గరుండి భర్తను హత్య చేయించాలనే ప్లాన్ వేసింది..అందులో భాగంగాలనే ప్రియుడు శివ,శివ ఫ్రెండ్ వైజాగ్ కి చెందిన రౌడీ షీటర్ గోపితో కలిసి భర్తను హత్య చేయించింది.బంగారు నగలు దొంగతనం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా,వారు చెప్తున్న దానికి,సరస్వతి చెప్పిన దానికి పొంతన కుదరకపోవడంతో..ఈ హత్యలో సరస్వతికి ఏమన్నా భాగం ఉందా అనే యాంగిల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటికి వచ్చింది..

అయ్యో పెళ్లై పది రోజులు కాలేదు భర్త ని పోగొట్టుకుంది అని బాదపడిన వారే ఇప్పుడు ఎంత కుట్ర పన్నింది అంటూ సరస్వతిని తిట్టుకుంటున్నారు..ఇలాంటి ఘటనలు జరుగిన ప్రతిసారి భర్తల్ని చంపేంత ధైర్యం ఉన్నప్పుడు,తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పేంత ధైర్యం ఎందుకు ఉండట్లేదనే ప్రశ్న తలెత్తుతుంది.వీటికి సమాధానం దొరికేదెన్నడో…