ఫ్యామిలీ హీరోగా మరోసారి మారుతున్న రాజశేఖర్  

Veerabhadram Chowdary Wrote Daughter Sentiment Story For Rajasekhar - Telugu Rajasekhar, Telugu Cinema, Tollywood, Veerabhadram Chowdary Wrote Daughter Sentiment Story

యాంగ్రీ యంగ్ మెన్ అంటే అందరికి ఒక అన్నయ్యగానో, తమ్ముడుగానో, గ్రామ పెద్దగానో కనిపిస్తాడు.అతని కెరియర్ లో ఎక్కువగా అలాంటి ఫ్యామిలీ డ్రామాల సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాయి.

Veerabhadram Chowdary Wrote Daughter Sentiment Story For Rajasekhar

అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీలుగా నిలిచినా మా అన్నయ్య, సింహరాశి లాంటి సినిమాలు అన్ని కూడా కుటుంబ బంధాలు, ఎమోషన్స్ ప్రధానంగా నడిచేవే.అయితే ఈ మధ్యకాలంలో అలాంటి ఫ్యామిలీ కథలకి రాజశేఖర్ దూరంగా ఉన్నాడు.

అతను చివరిగా గోరింటాకు అనే సినిమాతో ఫ్యామిలీ హీరోగా మెప్పించాడు.ఆ సినిమా మంచి ఎమోషనల్ డ్రామాతో అతనికి హిట్ ఇచ్చింది.

ఫ్యామిలీ హీరోగా మరోసారి మారుతున్న రాజశేఖర్-Movie-Telugu Tollywood Photo Image

తరువాత అలాంటి కథలకి ప్రాధాన్యత తగ్గడంతో రాజశేఖర్ కూడా వాటిని పక్కన పెట్టాడు.

ఇదిలా ఉంటే ఈ మధ్య గరుడ వేగ, కల్కీ సినిమాలతో తనలోని యాక్షన్ హీరోని మరోసారి చూపించి మెప్పించిన రాజశేఖర్ ఇప్పుడు వీరభద్రం చౌదరి దర్సకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చుట్టాలబ్బాయ్ సినిమా ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ దర్శకుడు రాజశేఖర్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజశేఖర్ మరల చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నాడు.ముఖ్యంగా కూతురు సెంటిమెంట్ తో ఈ సినిమా కథ ఉంటుందని ఉంటుందని తెలుస్తుంది.

ఇందులో మరోసారి ఒకప్పటి ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి దర్శకుడు వీరభద్రం చౌదరి ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు.మరి ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ ట్రాక్ ఉన్న రాజశేఖర్ ఈ సినిమాతో తన చరిష్మ ఎంత వరకు చూపిస్తాడు అనేది చూడాలి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Veerabhadram Chowdary Wrote Daughter Sentiment Story For Rajasekhar-telugu Cinema,tollywood,veerabhadram Chowdary Wrote Daughter Sentiment Story Related....