వీర సింహారెడ్డి హిట్... రేటు పెంచేసిన వరలక్ష్మి షాక్ లో నిర్మాతలు!

Veera Simha Reddy S Hit Producers In Varalakshmi Shock Who Increased The Rate ,Veera Simha Reddy , Varalakshmi ,Actress Varalakshmi Sarath Kumar

కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Veera Simha Reddy S Hit Producers In Varalakshmi Shock Who Increased The Rate ,v-TeluguStop.com

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఈ సినిమా తరువాత నాంది, యశోద సినిమాలలో కూడా నటించే సందడి చేశారు.

ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఈమె బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించారు.ఈ సినిమాలో వరలక్ష్మి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Telugu Varalakshmi-Movie

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో గుర్తింపు పొందిన ఈమెకు వరుస అవకాశాలు రావడంతో తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందని తెలుస్తుంది.వీర సింహారెడ్డి సినిమా హిట్ కావడంతో ఈమె తన తదుపరి సినిమాలకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Varalakshmi-Movie

ఇక బడా హీరోలు అలాగే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలలో తనకు అవకాశాలు కనుక వస్తే ఒకేసారి కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ ఒకేసారి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.అయితే ఈమెకు మంచి డిమాండ్ ఉండడంతో నిర్మాతలు కూడా చేసేదేమీ లేక ఈమె అడిగినదానికే సై అంటున్నారు.ప్రస్తుతం వరలక్ష్మి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube