Veera Simha Reddy Waltair Veerayya : బాలయ్య వర్సెస్ చిరు.. అసలైన పోటీ నైజాం లోనేనా?

వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది అని అనిపిస్తుంది.2023 సంక్రాంతి రేస్ కోసం స్టార్ హీరోలు ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు.ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్న విషయం విదితమే.ఇప్పటికే ఈ పోటీ ఉందని అధికారికంగా కూడా ఫిక్స్ అయ్యింది.సీనియర్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.

 Veera Simha Reddy Vs Waltair Veerayya, Director Gopichand Malineni, Director Bob-TeluguStop.com

దీంతో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.

ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయి.

దీంతో వీరిద్దరి సినిమాలకు థియేటర్స్ దగ్గర కూడా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక సంక్రాంతి సీజన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వందల కోట్లు వసూళ్లు చేసే సీజన్.అందుకే ఈ సీజన్ కు మరింత పోటీ వాతావరణం ఉంటుంది.

సీడెడ్ లో బాలకృష్ణ, ఆంధ్రలో చిరంజీవి సినిమాలు మరింత సందడి చేయడం ఖాయం.అయితే ఈ రెండు ఏరియాల్లో మినిమమ్ ఓపెనింగ్స్ ను దక్కించుకునే వీరు నైజాంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Balakrishna, Bobby, Chiranjeevi, Nizam, Veerasimha-Movie

నైజాం ఏరియాలో రెండు సినిమాలకు సమానంగా థియేటర్స్ లభిస్తేనే ఓపెనింగ్స్ ఎక్కువ వస్తాయి.ప్రెజెంట్ నైజాం లో ఈ రెండు సినిమాలు ఒకే బజ్ ను కలిగి ఉన్నాయి.ఇద్దరి సినిమాలపై ఫ్యాన్స్ మాట్లాడు కుంటున్నారు.కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం మా హీరోకి ఎక్కువ వస్తాయి అంటే మా హీరోకు వస్తాయి అని ఇప్పటి నుండే డిబేట్ లు స్టార్ట్ చేసారు.

చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube