నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమా ప్రెజెంట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ నెలలోనే వీలైనంత వరకు షూటింగ్ పూర్తి చేయాలని కష్టపడుతున్నారు టీమ్.బాలయ్య కేరీర్ లో 107వ సినిమాగా తెరకెకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి.
ఈ సినిమా కంటే ముందు బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దీంతో బాలయ్య ఫుల్ జోష్ లో ఈ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.” జై బాలయ్య” అనే సాంగ్ ను రిలీజ్ చేయగా ఇది వెంటనే నెట్టింట వైరల్ అయ్యింది.భారీ రెస్పాన్స్ అందుకుంటూ మరో చార్ట్ బస్టర్ దిశగా కొనసాగుతుంది.
ఈ సాంగ్ లో బాలయ్య తన యాటిట్యూడ్ తో మరోసారి అదర గొట్టాడు.ఇదిలా ఉండగా బాలయ్యతో పాటు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మరొకరి గురించి కూడా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
ఈ మధ్య వరుస సూపర్ హిట్స్ సాంగ్స్ అందిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసారి కూడా అదిరిపోయే సాంగ్ అందించాడు.మరి సాంగ్స్ అందించడమే కాకుండా ప్రొమోషనల్ గా కూడా థమన్ మ్యాజిక్ చేస్తున్నాడు.తాజాగా ” జై బాలయ్య” బాలయ్య సాంగ్ లో మరింత కొత్తగా మారి కనిపించాడు.దీంతో ఈయన లుక్ గురించి ఇప్పుడు నెట్టింట విపరీతంగా చర్చించు కుంటున్నారు.
ఈ పాటలో థమన్ లుక్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేయడంతో ఈసారి బాలయ్య ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.