మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ఎంతటి ప్రాముఖ్యతనిస్తారో, అలాగే వాస్తు శాస్త్రాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.మనం ఇల్లు కట్టే దగ్గరనుంచి ఆ ఇంట్లో అమర్చే ప్రతి వస్తువు దాకా ప్రతిదీ వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటాము.
ఇంటికి మహిళలు మహాలక్ష్మిగా భావిస్తారు.అలాంటిది ఇంటికి మంచి జరగాలంటే ఆ ఇంట్లోని స్త్రీలు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.సాధారణంగా కొంతమంది సంధ్యా సమయంలో దీపారాధన చేసిన తర్వాత తల దువ్వుకోవడం చేస్తుంటారు.అలా చేయడం ఇంటికి పరమ దరిద్రం.సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత తలలో దువ్వెన పెట్టకూడదు.అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంట్లో ఎవరు స్నానం చేయకూడదు.
మహిళలు వంట చేస్తారు కాబట్టి.వంట చేయడానికి ముందుగా స్నానమాచరించి వంట పని ప్రారంభించాలి.మన ఇంట్లో నీటికి సంబంధించిన ఎటువంటి వస్తువులు అయినా.వాటర్ ఫిల్టర్, స్విమ్మింగ్ పూల్, నీటి గుంతలు ఇలాంటివి ఏవైనా కానీ మన ఇంటికి నైరుతి భాగంలో ఉండకుండా చూసుకోవాలి.
వాస్తు ప్రకారం మన ఇంట్లో బీరువాను ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి.ఉత్తర దిశ కుబేరుని స్థానం కావడం వల్ల, బీరువాను ఉత్తరదిశలో ఉంచడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి.
అంతేకాకుండా బీరువాలో మనం డబ్బులు పెట్టే పెట్టెలో ఓ చిన్నపాటి అద్దాన్ని ఉంచడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది.అలాగే మన ఇంటి ముఖద్వారానికి ఎదురుగా అద్దం ఉంచడం వల్ల మన ఇంటి పై ఏర్పడే ప్రతికూల వాతావరణం,అద్దంలో ఏర్పడే ప్రతిబింబం వల్ల తిరిగి బయటకు వెళ్లి మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఇలాంటి వాస్తు టిప్స్ ను పాటించడం ద్వారా మన ఇంట్లో ఎప్పుడు అనుకూల వాతావరణం ఏర్పడి సుఖ సంతోషాలతో, సిరి సంపదలు కలుగుతాయి.