బాబు మళ్లీ సీ ఎం కాలేరట....కారణం తెలిస్తే షాకే  

Vastu Says Chandrababu Naidu Will Not Be A Cm For Ap-chandrababu Naidu,janasena Party,pawan Kalyan,tdp,vastu About Chandrababu Naidu,who Is Next Cm Of Andhra Pradesh,ycp,ys Jagan

ఏపీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ దగ్గర పడుతుండడం తో ఎవరి సమీకరణాలు వారి చెప్పుకుంటూ పోతున్నారు. ఒకపక్క సర్వే లలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది,ఈ పార్టీ విజయం సాధిస్తుంది అంటూ భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సర్వే లో మాత్రం మళ్లీ టీడీపీ కే అధికారం దక్కుతుంది అని రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే..

బాబు మళ్లీ సీ ఎం కాలేరట....కారణం తెలిస్తే షాకే-Vastu Says Chandrababu Naidu Will Not Be A CM For AP

అయితే జ్యోతిష్యులు మాత్రం ఈ సారి చంద్రబాబు అధికారంలోకి రారు అని బల్లగుద్ది చెబుతున్నారు. కారణం లేకపోలేదు, బాబు ఈ సారి అధికారంలోకి రారు అని గట్టి గా చెప్పడానికి కారణం ఏపీ సచివాయలం లో వాస్తు దోషాలు. అవును ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి సర్వే ప్రకారం టీడీపీ అధికారం లోకి వస్తుంది అని చెబుతుండగా సచివాలయంలో వాస్తు దోషాల కారణంగా ఈసారి బాబు సి ఎం కాలేరు అంటూ జ్యోతిష్యులు చెబుతున్నారు.

విజయవాడకు చెందిన వాస్తు సిద్ధాంతి గోటూరి సచివాలయ వాస్తును విశ్లేషిస్తూ వెలగపూడి సచివాయంలో ఈశాన్య ద్వారం మినహాయిస్తే… మిగతా అన్ని స్ధానాల్లోనూ వాస్తు దోషాలు ఉన్నాయని కావున బాబు అన్నీ విషయాల్లోనూ వెనకబడే ఉంటారు అని తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించని ఆయన ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ దగ్గర పడుతున్న ఈ సమయంలో సచివాయలం వాస్తు బాలేదంటూ వ్యాఖ్యానించడం తో ఇప్పుడు ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఒక్క ఈశాన్య గేట్ తప్ప…మొత్తం సెక్రటేరియట్ వాస్తు సరిగా లేదని, ముక్కోణం రోడ్… రోడ్ శుల. ఇలా అన్నీ వాస్తు దోషాలు ఉన్నాయని సెక్రటేరియట్ వాస్తు ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందని సిద్ధాంతి తెలిపారు. తప్పుడు నిర్ణయాలకు సీఎం బలి కానున్నారంటూ సిద్ధాంతి తెలిపారు.

అలానే ఈ వాస్తు దోషాల కారణంగా ఏ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కి వెళ్లిన డౌన్ అయిపోతారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే సర్వేల రిజల్ట్ తో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు సచివాయలం లో వాస్తు దోషాలు ఉన్నాయి అంటూ జ్యోతిష్యులు చెప్పడం తో ఇక వారిలో ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 23 న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ రానున్న సంగతి తెలిసిందే.