Bigg Boss6 Telugu : బిగ్ బాస్ విన్నర్ అతనేనని చెబుతున్న వాసంతి.. అలా జరగడం సాధ్యమేనా?

బిగ్ బాస్ షో సీజన్6 నుంచి తాజాగా వాసంతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.మెరీనా ఎలిమినేట్ అవుతుందని మొదట ప్రచారం జరిగినా వాసంతిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు.

 Vasanthi Shocking Comments About Bigg Boss Winner Details Her,bigg Boss6,vasanth-TeluguStop.com

వాసంతికి సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారని ఏ మాత్రం క్రేజ్ లేని కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాసంతి తన అభిప్రాయం ప్రకారం రేవంత్ బిగ్ బాస్ షో విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం.గేమ్ లో అగ్రెసివ్ గా ఉండటంతో పాటు చాలా కష్టపడతాడని ఈ రీజన్ వల్లే రేవంత్ బిగ్ బాస్ సీజన్6 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాసంతి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Telugu Baladitya, Bigg Boss, Chalaki Chanti, Nagarjuna, Revanth-Movie

ఇతర కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే గేమ్ బెటర్ గా ఆడటంతో పాటు ఇతరులతో బాగా ఉంటాడని ఈ రీజన్ వల్లే రేవంత్ బిగ్ బాస్ షోకు విజేతగా నిలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని వాసంతి చెప్పుకొచ్చారు.మరోవైపు కొంతమంది కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షో నిర్వాహకుల సపోర్ట్ ఉందని ఆ రీజన్ వల్లే ఈ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.చలాకీ చంటి, బాలాదిత్య స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

వాసంతి అంచనాల ప్రకారం రేవంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచి ఆశ్చర్యపరుస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube