హైదరాబాద్ చేరుకున్న మెగా కపుల్స్... ఘన స్వాగతం పలికిన అభిమానులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా నవంబర్ ఒకటవ తేదీ జరిగిన సంగతి మనకు తెలిసిందే.కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Varuntej And Lavanya Tripati Come Back To Hyderabad After Wedding, Varun Tej,lav-TeluguStop.com

మూడు రోజులపాటు ఎంతో ఘనంగా ఈ పెళ్లి వేడుకలు జరిగాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వీరి పెళ్లి ఒకటవ తేదీ జరగగా నవంబర్ 5వ తేదీ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ జరగబోతుంది.ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Telugu Hyderabad, Italy, Lavanya Tripati, Varun Tej-Movie

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి కూడా హైదరాబాద్ చేరుకోవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా కోడలుగా( mega daughter-in-law ) మొదటిసారి ఈమె హైదరాబాదులోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కూడా వీరిపై పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.ఇలా ఒకేసారి చిరు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ఇలా మెగా కోడలి హోదాలో ఈమె మొదటిసారి హైదరాబాద్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

వీరితోపాటు రామ్ చరణ్ ఉపాసన అలాగే శ్రీజ సుస్మిత వారి పిల్లలతో పాటు ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.

Telugu Hyderabad, Italy, Lavanya Tripati, Varun Tej-Movie

నవంబరు ఒకటవ తేదీ ఎంతో ఘనంగా వీరి వివాహం జరగకగా నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక జరగనుంది.ఈ వివాహ రిసెప్షన్ వేడుక కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు.ఇలా సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరు కారున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం వీరి ఎయిర్ పోర్ట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube