వరుణ్ తేజ్ సినిమా చుట్టూ గొడవలు.. ఎందుకంటే?

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి అందరికి తెలిసిందే.ప్రముఖ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు కుమారుడు.

 Varun Tejs Movie Facing Several Problems-TeluguStop.com

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు.ముకుంద సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వరుణ్.

ఆ తర్వాత కంచె, లోఫర్ వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక గద్దల కొండ గణేష్ సినిమాలో నటించి తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.

 Varun Tejs Movie Facing Several Problems-వరుణ్ తేజ్ సినిమా చుట్టూ గొడవలు.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఇక వీటి కోసం ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నాడు వరుణ్.అంతేకాకుండా కొన్ని గాయాలు తగిలినా కూడా ఆయన పట్టుదల మాత్రం వదలట్లేదు.

ఈ సిని బృందం కూడా ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నారు.

కానీ కొన్ని ఇబ్బందులు ఈ సినిమాని వెంటాడుతున్నాయి.

అది కూడా బడ్జెట్ విషయంలో. అల్లు బాబీ, అతని స్నేహితుడు సిద్ధూ ఈ సినిమాకు నిర్మాతగా చేస్తున్నారు.

అయితే వీరి మధ్య బడ్జెట్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.బాబీ వరుణ్ తేజ్ సినిమా కోసం ఖర్చు విషయంలో కూడా తగ్గట్లేదు.

ఇటీవల ఈ సినిమా కోసం భారీ సెట్ వేయించాడు.కానీ అందులో ఒక్క సీన్ కూడా షూటింగ్ చేయకుండానే సెట్ ను తొలగించారని తెలిసింది.

దీనివల్ల కూడా ఎంతో నష్టపోయారని తెలిసింది.కథలో కూడా కొన్ని మార్పులు జరగడంతో మరి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వగా.

మళ్లీ మరో సమస్య కరోనా రూపంలో ఎదురొచ్చింది.ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

#Varun Tej #FacingServeral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు