చరణ్ వాయిస్‌ తో వచ్చిన మెగా 'గని' టీజర్ టాక్‌

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన గని విడుదలకు సిద్దం అయ్యింది.సాయి మంజ్రేకర్ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా ను కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం లో అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు నిర్మించారు.

 Varun Teja Ghani Movie Teaser With Ram Charan Voice Over,varun Teja , Ghani Movi-TeluguStop.com

అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.వరుణ్ తేజ్ ఈ సినిమా లో బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఒక సామాన్యమైన వ్యక్తి బాక్సర్ గా ఎలా నిలిచాడు.అతడి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటీ అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా టీజర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది.

సినిమా విడుదలకు తేదీ దగ్గర పడుతున్న సమయంలో విడుదల అయిన ఈ టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది.రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ దుమ్ము రేపుతుంది.

డిసెంబర్ 24న భారీ ఎత్తున విడుదల కాబోతున్న గని సినిమా షూటింగ్ ముగించుకుంది.ఇటీవలే చివరి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది.సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్‌ చేస్తూ తాజాగా విడుదల అయిన ఈ టీజర్ లో రామ్‌ చరణ్ వాయిస్ ప్రథాన ఆకర్షణగా నిలిచింది అంటూ టాక్ వినిపిస్తుంది.రామ్‌ చరణ్ చాలా పవర్ ఫుల్‌ వాయిస్ తో డైలాగ్స్ చెప్తూ ఉండగా వరుణ్‌ తేజ్ స్క్రీన్‌ పై అలా దూకుతూ ఉండగా అద్బుతమైన మాస్ మసాలా సినిమాను చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు కన్నడ స్టార్‌ ఉపేంద్ర మరియు సునీల్ దత్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.బాక్సింగ్ నేపథ్యం లో సినిమా కనుక ఖచ్చితంగా పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది.అందుకే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube