మెగా హీరో మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్లేనా?

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం గని విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే డిసెంబర్‌ 24న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

 Varun Tej Ghani Movie Release Date May Be Change Details, Gani Movie, Varun Tej,-TeluguStop.com

కాని డిసెంబర్‌ లో ఉన్న పోటీ మరియు వెంటనే జనవరిలో రాబోతున్న సినిమాల నేపథ్యంలో గని సినిమా విడుదల వాయిదా వేయడం మంచిది అని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు నిర్మాతలకు అల్లు అరవింద్‌ సూచించడంతో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో గని సినిమా విడుదల ఉండదు అని తేలిపోయింది.

తాజాగా గని టీజర్ 10 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ట్విట్టర్ లో ప్రకటించారు.ఆ సమయంలో విడుదల తేదీని తొలగించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

సినిమా విడుదల ఇప్పట్లో లేదు కనుక ప్రమోషన్ విషయంలో కాస్త సైలెంట్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

తెలుగు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్దం అవుతున్నారు.

కనుక పోటీ లేని సమయంలో గనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.గని కనుక డిసెంబర్‌ లో విడుదల అయితే థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది.

సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చినా మంచి వసూళ్లు నమోదు అవ్వవు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే గని విడుదల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా లో ఉపేంద్ర మరియు సునీల్ శెట్టిలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇక వరుణ్‌ కు జోడీగా ఈ సినిమాలో సాయి మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

 గని కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.ప్రస్తుతానికి సమయం లేదు.సమ్మర్ వరకు వెయిట్ చేస్తారా లేదంటే మద్యలో ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube