మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తాజా చిత్రం బాక్సర్ కోసం తెగ కష్టపడుతున్నాడు.ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు ఈ మెగా హీరో.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటికే పరిమితం కావాలని పలు దేశాలు సూచిస్తున్నాయి.ఈ క్రమంలో తాను కూడా ఇంటికే పరిమితం అవుతున్నానంటూ బాక్సర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిమ్‌లు కూడా మూసి వేయడంతో ఇంటి వద్దనే ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్.దీనికి సంబంధించిన ఓ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు.
ఇంటి వద్దనే బాక్సింగ్ చేస్తూ ఎండలో చెమటోడుస్తున్నాడు.అందరూ ఇంటివద్దనే ఉంటూ పని చేసుకోవాలని, ఇంటి వద్ద ఉండటమే ప్రస్తుతం సురక్షితం అని ఆయన అన్నాడు.
కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
అల్లు బాబీ మరియు సిద్ధు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.