వరుణ్ తేజ్ బాక్సర్ లో ఆ బాలీవుడ్ హీరోయిన్ కన్ఫర్మ్  

Varun Tej With Dabangg3 Heroine Saiee Manjrekar, Tollywood, Mega Prince, Kiran Korrapati, Varun Tej, Boxer Movie - Telugu Boxer Movie, Kiran Korrapati, Mega Prince, Tollywood, Varun Tej, Varun Tej With Dabangg3 Heroine Saiee Manjrekar

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కరోనా కంటే ముందుగానే స్టార్ట్ అయ్యింది.

TeluguStop.com - Varun Tej With Dabangg3 Heroine Saiee Manjrekar

కొంత భాగం షూట్ అయిన తర్వాత లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.అయితే చాలా గ్యాప్ తర్వాత మరల షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

నవంబర్ 2న హైదరాబాద్ లో తిరిగి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.మొదటి షెడ్యూల్ లో భాగంగా వరుణ్ తేజ్, నవీన్ చంద్ర మధ్య కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది.

TeluguStop.com - వరుణ్ తేజ్ బాక్సర్ లో ఆ బాలీవుడ్ హీరోయిన్ కన్ఫర్మ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తరువాత ఢిల్లీ వెళ్లి ఒక వారం రోజుల పాటు కొన్ని సీన్లు తీస్తారట.అలాగే వైజాగ్‌లో ఒక సాంగ్ షూట్ చెయ్యనున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి వేసవి బరిలో తీసుకురావాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3లో ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

అయితే ఈ మధ్య కాలంలో ఇందులో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ ని తప్పించి నభా నటేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్ వినిపించింది.అయితే అందులో వాస్తవం లేదని తాజాగా దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.

ఆల్రెడీ వైజాగ్ షెడ్యూల్లో వరుణ్ తేజ్, నవీన్ చంద్రతో కలిసి సాయి మంజ్రేకర్ యాక్ట్ చేశారు.ఆమెను రీప్లేస్ చేసే ఆలోచన లేదు.ఒకవేళ చేస్తే మళ్ళీ 16 రోజులు తీసిన సీన్లు కొత్తగా తీయాలి.ఆమెని తప్పించే ఆలోచనకూడా లేదని దర్శకుడు కిరణ్ తేల్చేశాడు.

మొత్తానికి ఈ క్లారిటీతో సినిమా మీద వినిపించిన రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.

#Kiran Korrapati #Varun Tej #Mega Prince #VarunTej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varun Tej With Dabangg3 Heroine Saiee Manjrekar Related Telugu News,Photos/Pics,Images..