రౌడీ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ఫైటర్ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆలోచిస్తున్నాడు.ఇప్పటికే సినీ వర్గాల్లో ఈ టైటిల్ దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

 Varun Tej Waiting For Vijay Devarakonda, Varun Tej, Vijay Devarakonda, Fighter,-TeluguStop.com

కాగా ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న పూరీ మరో హీరో సినిమాకు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టాడట.మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా భవిష్యత్తు పూరీ జగన్నాథ్ చేతిలో ఉందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి బాక్సర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తాడు.

అయితే ఈ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేసే సమయానికి పూరీ జగన్నాథ్ తన చిత్రం కోసం రెండు టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించాడట.ఫైటర్‌తో పాటు బాక్సర్ అనే టైటిళ్లను ఆయన రిజిస్టర్ చేయించి పెట్టుకున్నాడట.

అయితే పూరీ తన సినిమాకు ఏదో ఒక టైటిల్‌ను ఫిక్స్ చేసుకుంటే, రెండో టైటిల్‌ను తమ చిత్రానికి వాడుకోవాలని వరుణ్ తేజ్ అండ్ టీమ్ వెయిట్ చేస్తున్నారు.మరి పూరీ తన సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెట్టుకుంటాడో, వరుణ్ తేజ్‌కు ఎలాంటి టైటిల్‌ను కేటాయిస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా పూరీ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే మిగతా షూటింగ్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube