దసరాకు పట్టాలెక్కబోతున్న వరుణ్ తేజ్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ !

వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆయనకు ఫేమ్ వచ్చింది.

 Varun Tej Venky Kudumula Movie Start From Dasara-TeluguStop.com

తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది.వరసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

దీంతో తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Varun Tej Venky Kudumula Movie Start From Dasara-దసరాకు పట్టాలెక్కబోతున్న వరుణ్ తేజ్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భీష్మ సినిమా హిట్ తర్వాత చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి.

వెంకీ కుడుముల ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఒప్పించాడని కూడా టాక్ వచ్చింది.ఆయన చెప్పిన కథ నచ్చడంతో చిరంజీవి కూడా ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తుంది.

అయితే ఆయన ప్రస్తుతం బిజీగా ఉండడంతో వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కు మరొక కథ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి.

వరుణ్ తేజ్ కు కూడా వెంకీ కుడుముల కథ బాగా నచ్చిందని ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాను దసరా నుండి సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని వెంకీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Telugu Anil Ravipudi, Dasara, F3, Ghani, Kiran Korrapati, Latest Update, Megastar Chiranjeevi, Mehreen, Saiee Manjrekar, Tamanna, Varun Tej, Varun Tej Latest Movie, Varun Tej Movie Update, Varun Tej Venky Kudumula Movie Start From Dasara, Venky Kudumula-Latest News - Telugu

అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఘని సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఘని సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా సయీ మంజ్రేకర్ నటిస్తుంది.ఈ సినిమాను జులై 30 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.ఇక ఎఫ్ 3 సినిమాలో వరుణ తో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 27 వ విడుదల కాబోతుంది.

#Tamanna #VarunTej #VarunTej #Venky Kudumula #Dasara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు