కేంద్ర మంత్రి వద్దకు 'వాల్మీకి' టైటిల్‌ వివాదం

మెగా మూవీ ‘వాల్మీకి’ ప్రస్తుతం విడుదలకు సిద్దం అవుతోంది.మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వాల్మీకి’ చిత్రంపై వివాదం మొదటి నుండి రాజుకుంటూనే ఉంది.

 Varun Tej Valmiki Tittle Matter Go The Centralminister Boyalu-TeluguStop.com

టైటిల్‌ విషయంలో బోయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.వాల్మీకి అంటూ ఒక రౌడీకి పేరు పెట్టి సినిమాను తీయడం వల్ల మా మనోభావాలను దెబ్బ తీయడం జరుగుతుందని, ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ తీవ్ర అసహనంను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై రచ్చ ఏకంగా కేంద్ర మంత్రి వద్దకు వెళ్లింది.

Telugu Boyalu, Varuntej-

  బోయలకు మద్దతుగా నిలుస్తున్న ఎంపీ తలారి రంగయ్య ఈ విషయమై కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఇంతగా విమర్శలు వస్తున్నా కూడా వాల్మీకి చిత్రంకు సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.అసలు వాల్మీకి అనే టైటిల్‌తో సినిమా వద్దని మొదటి నుండి చెబుతున్నా కూడా వారు పట్టించుకోకుండా సినిమాను పూర్తి చేసి అదే టైటిల్‌తో విడుదలకు సిద్దం అయ్యారని ఎంపీ అన్నాడు.

Telugu Boyalu, Varuntej-

 

1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒక జాతి లేదా సంఘం మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమాలు కాని, సినిమా టైటిల్స్‌ కాని ఉండవద్దు.అయినా కూడా వాల్మీకి టైటిల్‌ను వారు తొలగించడం లేదు అంటూ రంగయ్య మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వద్ద ఫిర్యాదు చేశాడు.ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని, సినిమా టైటిల్‌ మార్చకుండా సినిమా విడుదలకు స్టే ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నాడు.మొత్తానికి విడుదల వారం రోజులు ఉన్న ఈ సమయంలో ఇలాంటి వివాదం సినిమాపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube