మెగా హీరో సిక్స్ ప్యాక్.. గని కోసం వరుణ్ తేజ్ మామూలు కష్టం కాదుగా?

టాలీవుడ్ మెగా యంగ్ హీరో, సీనియర్ నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ గురించి అందరికీ పరిచయమే.ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి తొలిసారి నటనతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Varun Tej Six Pack Ghani Makeover Still Goes Viral Details,  Mega Hero, Varun Te-TeluguStop.com

ఆ తర్వాత కంచె, లోఫర్, ఎఫ్2 వంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే గని సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు ఈ మెగా హీరో.

ప్రస్తుతం వరుణ్ తేజ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాగా కష్ట పడుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా తన ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఆ ఫోటోను చూసినట్లయితే అందులో సిక్స్ ప్యాక్ తో బాగా ఆకట్టుకున్నాడు.మొత్తానికి వరుణ్ తేజ్ గని సినిమా కోసం మామూలుగా కష్ట పడటం లేదుగా అన్నట్లు కనిపిస్తున్నాడు.

ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.అంతేకాకుండా చిరంజీవి సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు అది కూడా లూసిఫర్ రీమేక్ లో అని గతంలో టాక్ వినిపించింది.మొత్తానికి వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బాగా బిజీ గా మారాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube