మెగా ఫ్యామిలీపై మెగా హీరో సెటైర్ ...

మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సినిమాల్లో తిరుగుని ఇమేజ్ ఆయ‌న సొంతం.

 Varun Tej Says Mega Family Is A Small Size Cricket Team-TeluguStop.com

ఆ ఇమేజ్‌ను బేస్ చేసుకుని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బ‌న్ని, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలా అంద‌రూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.వారి స్ట‌యిల్స్‌లో సినిమాలు చేస్తూ స‌క్సెస్‌లు సాధించారు.

ఇప్పుడు వార‌స‌త్వంగా వ‌స్తున్న సినిమా ఇమేజ్‌లో ఎక్కువ మంది హీరోలున్న ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీయే కావ‌డం విశేషం.త‌న ఫ్యామిలీపై హీరో వ‌రుణ్‌తేజ్ సెటైర్ వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

చిరంజీవి ఆడియో వేడుక‌కు రాకుండా వీడియో బైట్ పంపించ‌డం వెనుక గ‌ల కార‌ణాన్ని వివ‌రిస్తూ వ‌రుణ్ మా ఫ్యామిలీయే చిన్న‌సైజ్ క్రికెట్ టీమ్‌లా త‌యారైంది.ప్ర‌తి నెల ఎవ‌రో ఒకరిది ఆడియో రిలీజ్ కావ‌డం, ఆ వేడుకకు చిరంజీవిగారు రావ‌డం కామ‌న్ అవుతుంద‌ని భావించి, పెద్ద‌నాన్న‌గారే లోఫ‌ర్ ఆడియో వేడుక‌కు రాలేదు అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.

ఏదేమైనా త‌మ ఫ్యామిలీ హీరోల‌ను గురించి ఎక్క‌డా త‌ప్పుగా మాట్లాడ‌కుండా సున్నిత‌మైన సెటైర్ వేయ‌డంతో వ‌రుణ్ తేజ్ గ‌ట్టిపిండ‌మేన‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube