వాల్మీకి చిత్రంలో మాస్ వరుణ్ ని చూస్తారు అంటున్న దర్శకుడు  

వాల్మీకితో మెగా ఫాన్స్ కి మెప్పించడానికి సిద్ధం అవుతున్న వరుణ్ తేజ్. .

Varun Tej Ready To Entertain Mega Fans With Valmiki Movie-

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ జోనర్ లో వెళ్ళకుండా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ కి క్రియేట్ చేసుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.ఇక కెరియర్ లో అతను చేసిన సినిమాలతో కమర్షియల్ హీరోగా కంటే నటుడుగా మాత్రం వరుణ్ తేజ్ బెస్ట్ అనిపించుకున్నాడు.కంచె సినిమా నుంచి తాజాగా వచ్చిన ఎఫ్ 2, అంతరిక్షం వరకు వరుణ్ తేజ్ క్లాస్ లుక్స్ తో క్లాస్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయిపోయాడు.అయితే మెగా ఫాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ వరుణ్ తేజ్ లో లేవనే టాక్ మొదటి నుంచి వినిపిస్తుంది..

Varun Tej Ready To Entertain Mega Fans With Valmiki Movie--Varun Tej Ready To Entertain Mega Fans With Valmiki Movie-

రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టైల్ లో కమర్షియల్ హీరో లక్షణాలు అతని లో లేవనే అభిప్రాయం వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ తాజాగా గబ్బర్ సింగ్ లో సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ కి అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇది వరకు కనిపించని విధంగా ఫుల్ మాస్ లుక్ తో రౌడీ పాత్రలో సందడి చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలకి భిన్నమైన పాత్ర కావడంతో వరుణ్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.ఇక మాస్ ప్రేక్షకులకి కనెక్ట్ కావడానికి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని హరీష్ శంకర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర డిజైన్ చేసినట్లు సమాచారం.మరి ఈ వాల్మీకి సినిమాతో వరుణ్ మెగా ఫాన్స్ కి ఎంత వరకు ఎంటర్టైన్ చేయగలడో చూడాల్సిందే.