వెంకీ కుడుములతో సినిమా చేయబోతున్న వరుణ్ తేజ్!!

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకీ కుడుముల.ఆ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆయనకు ఫేమ్ వచ్చింది.

 Varun Tej Next Movie With Venky Kudumula-TeluguStop.com

తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అయన పేరు మరు మోగిపోతుంది.వరసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాదు తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Varun Tej Next Movie With Venky Kudumula-వెంకీ కుడుములతో సినిమా చేయబోతున్న వరుణ్ తేజ్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే భీష్మ సినిమాతో మంచి హిట్ తన ఖాతా లో వేసుకున్న వెంకీ కుడుముల ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఒప్పించాడని కూడా టాక్ వచ్చింది.

ఆయన చెప్పిన కథ నచ్చడంతో చిరంజీవి కూడా ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తుంది.అయితే ఆయన ప్రస్తుతం బిజీగా ఉండడంతో వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కు మరొక కథ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి.

వరుణ్ తేజ్ కు కూడా వెంకీ కుడుముల కథ బాగా నచ్చిందని ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడని ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఘని సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఘని సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా సయీ మంజ్రేకర్ నటిస్తుంది.

మరి ఈ రెండు సినిమాల తర్వాతే వెంకీ కుడుముల తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ వార్త నిజమైతే వెంకీ కుడుముల తర్వాత సినిమా వరుణ్ తేజ్ తో ఉంటుంది. వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కాంబినేషన్ సినిమా సెట్ అయితే ఇద్దరు మరొక హిట్ తమ ఖాతాలో వేసుకున్నట్లే.

మరి చూడాలి ఈ వార్తలో నిజం ఎంత ఉందో.

#Venky Kudumula #VarunTej #Varun Tej #Gossip #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు