సూపర్ స్టార్ లా తలపిస్తున్న మెగా ప్రిన్స్.. నెట్టింట పిక్ హల్ చల్!

మన టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనలో వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.ఈయన మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.

 Varun Tej Latest Photo Viral On Social Media, Mega Hero, Varun Tej, Ghani, Prave-TeluguStop.com

మిగతా మెగా హీరోల కంటే కూడా తెలివిగా డిఫెరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ఈయనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలం అయ్యాడు.

ఇటీవలే వరుణ్ తేజ్ గని సినిమాతో వచ్చాడు.

ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కింది.అల్లు బాబీ, సిద్ధూ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఫెయిల్ అయినా వెంటనే ఎఫ్ 3 సినిమాతో వచ్చి వెంటనే సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్.

ఇలా వరుణ్ తేజ్ తన ఎనిమిదేళ్ల కెరీర్ లో 11 సినిమాలు చేయగా ఎక్కువగా హిట్ సినిమాలే ఉన్నాయి.

ఇక ఇప్పుడు వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఇది కూడా డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కుతుంది.అయితే ప్రెసెంట్ టాలీవుడ్ లో బంద్ నడుస్తున్న నేపథ్యంలో వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Telugu Ghani, Praveen Sattar, Varun Tej-Movie

అందరు హీరోలు ఇళ్లకే పరిమితం అయితే మెగా ప్రిన్స్ మాత్రం బంద్ కోసం వచ్చిన సమయాన్ని వెకేషన్ కోసం వాడుకుంటున్నాడు.తాజాగా వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఒక పిక్ షేర్ చేసాడు.ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఈయన లేటెస్ట్ పిక్ చూసిన వారంతా మహర్షి సినిమాలో సూపర్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లగ్జీరియస్ బోట్ లో సముద్రంలో వెళుతూ బ్లాక్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించి చేతిలో కోక్ తో మహర్షి ని తలపిస్తున్నాడు.

ఈ పిక్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఈ పిక్ లో ఏడు రకాల బ్లు కలర్స్ మ్యాచ్ అయ్యాయట.

అందుకే వరుణ్ 7 కూల్ బ్లుస్ అంటూ ఈ ఫోటో షేర్ చేస్తూ చెప్పుకొచ్చాడు.మొత్తానికి వరుణ్ వెకేషన్ ను బాగా రిచ్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube