ఆ సినిమా అయితే వరుణ్ తేజ్ కి కరెక్ట్ గా సరిపోతుందంట... 

టాలీవుడ్ టవర్ స్టార్ మరియు మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో పలు ఆసక్తికర అంశాలను పంచుకుంటున్నాడు.ఒక పక్క పలు షోలు, ఈవెంట్లలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

 Varun Tej, Kodama Simham, Chiranjeevi, Tollywood, Nagababu,-TeluguStop.com

అయితే తాజాగా నాగబాబు సోషల్ మీడియా మధ్య మైనటువంటి ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా పలువురు అభిమానులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అందించాడు.అయితే ఇందులో ఓ నెటిజన్ మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి చిత్రాల్లో ఏ చిత్రం అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి బాగా సూటవుతుందని మీరు భావిస్తున్నారని అడిగాడు.దీంతో నాగబాబు “అన్నయ్య చిరంజీవి నటించిన చాలెంజ్ మరియు కొదమసింహం చిత్రాలయితే వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సూట్ అవుతాయని తెలిపాడు.ముఖ్యంగా కొదమ సింహం చిత్రం అప్పట్లోనే హాలీవుడ్ తరహాలో తీశారని ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమేగాక సినీ విమర్శకుల నుంచి కూడా మంచి మన్ననలు పొందిందని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నాడు.దీంతో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.దీంతో టాలీవుడ్ లోని కొందరు ఈ చిత్రం అప్పట్లో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రానికి రీమేక్ గా ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube