నిహారిక చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్.. ఏర్పాట్లలో వరుణ్ తేజ్!

నిహారిక.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Niharika Konidela, Chaithanya Jonnalagadda, Destination Weeding, Nagababu, Varun-TeluguStop.com

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయి మన నిహారిక.యూట్యూబ్ లో ముద్దపప్పు ఆవకాయ అంటూ వెబ్ సిరీస్ తీసి బుల్లితెరపై యాంకర్ గా చేసి సినిమా హీరోయిన్ అయిన నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.ఎన్నో సినిమాల్లో నటించిన నిహారికకు సినిమా కలిసిరాలేదు.అందుకే మెగా డాటర్ అయినా సరే సినిమాలు హిట్ అవ్వలేదు.

ఇంకా ఈ నేపథ్యంలోనే నిహారిక పెళ్లి చేసుకోనుంది.ఈ ఏడాది చివరిలో పెళ్లి చేయాలనీ కుటుంబసభ్యులు నిర్ణయించగా ఇప్పటికే నిశ్చితార్థం అయిపొయింది.

పసుపు ఫంక్షన్ కూడా పూర్తి చేసుకున్న నిహారిక పెళ్లి ముహుర్తాలు లేక ఏడాది చివరికి పెళ్లి నిశ్చయించారు.ఇక ఈ నేపథ్యంలోనే నిహారిక పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నాగబాబు.

ఓ ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

నిహారిక పెళ్లి విషయంలో మెగా కుటుంబం అంత సంతోషంగా ఉన్నట్టు.

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఎంతో దారుణంగా మారిందని, ఇలాంటి సమయంలో నిహారిక పెళ్లి జరగడం ఇంట్లో ఆనందాన్ని తెచ్చిందని చెప్పిన నాగబాబు.నిహారిక పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వరుణ్ తేజ్ చూసుకుంటున్నట్టు.డిసెంబర్ నెలలో నిహారిక, చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్టు.పెళ్లి తేదిని త్వరలోనే అందరికి తెలియజేస్తామని నాగబాబు చెప్పుకొచ్చాడు.

దీంతో ప్రస్తుతం నిహారిక పెళ్లి విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.కాగా గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు కొడుకు చైతన్యతో నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరగగా నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలర్ పార్టీ జరుపుకొని నెట్టింట హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube