నానికి కలిసి వచ్చిన వేళా... మళ్ళీ మెగా హీరో సినిమా వెనక్కి..!

న్యాచురల్ స్టార్ నాని హిట్ ఫ్లాప్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్.

 Varun Tej Ghani Movie Postponed Nani Shaym-singha Roy Route-clear Nani, Ghani, V-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదల కానున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి పోటీగా క్రిస్మస్ బరిలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం కూడా విడుదల కాబోతుందని చిత్రబృందం అధికారికంగా విడుదల చేశారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమా నాని సినిమా 2 ప్రత్యేకమైన జోనర్ లో తెరకెక్కడంతో ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యాయి.అయితే ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు.

కానీ గని సినిమా విడుదల తేదీని ప్రకటించిన వారం రోజుల్లోనే ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Ghani, Nani, Sai Manjaker, Sai Pallavi, Tollywood, Varun Tej-Movie

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా వాయిదా పడినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ఈ పోటీ కారణంగా ఈ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులకు రీచ్ కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు వెల్లడించారు.

ఇలా మెగా హీరో సినిమా వెనక్కి తగ్గడంతో నాని సినిమాకు ఎలాంటి పోటీ లేకపోవడంతో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube