వరుణ్ తేజ్ సినిమా గని వచ్చేది ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం గని .బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా సందడి చేయనున్నారు.

 Varun Tej Ghani Movie Intresting Update Will Announce Today August 5th 2021-TeluguStop.com

ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ నటిస్తోంది.కరోనా తర్వాత షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈరోజు సాయంత్రం 5.04 తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ రోజు సాయంత్రం వరుణ్ సందేశ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని జూలై 30 తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది.అయితే కరోనా కారణం చేత షూటింగ్ వాయిదా పడడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారని ఆ విషయాన్ని సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

 Varun Tej Ghani Movie Intresting Update Will Announce Today August 5th 2021-వరుణ్ తేజ్ సినిమా గని వచ్చేది ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక వరుణ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#Varun Tej #Ghani #Varun Tej #Ghani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు